వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవానికి గురి కావడంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై జగన్ దృష్టి సారించారు. అందులో భాగంగా కీలక స్థానాలకు బాధ్యులను జగన్మోహన్‌రెడ్డి నియమించారు. మొత్తంగా 15 విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని నియమించారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవానికి గురి కావడంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై జగన్ దృష్టి సారించారు. అందులో భాగంగా కీలక స్థానాలకు బాధ్యులను జగన్మోహన్‌రెడ్డి నియమించారు. మొత్తంగా 15 విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని నియమించారు. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షుడి ఖాదర్ బాషా, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనహర్ రెడ్డి, సాంస్కృతి విభాగం అధ్యక్షుడిగా వంగపండు ఉష, ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునీల్, ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునీల్, వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ రాజు, గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణ మూర్తి, వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా రామచంద్రరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.
తాజా నియామకాలు ద్వారా ఆయా విభాగాలను మరింత బలోపేతం చేయనున్నట్టు జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా ప్రజా సమస్యలపై పోరాటాన్ని సాగించడంతోపాటు అధికారాన్ని సాధించేందుకు దోహదం చేస్తుందన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. ఆయా విభాగాలు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని సాగించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ముందుకు వెళ్లాలని ఆయా విభాగాధిపతులకు జగన్మోహన్‌రెడ్డి సూచించారు.