ఓటమి తర్వాత జగన్ తొలి ట్వీట్.. టిడిపి దాడులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు వినతి

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తొలిసారి ట్విట్టర్ (ఎక్స్)వేదికగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.

Jagan Mohan Reddy

జగన్మోహన్ రెడ్డి  


రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తొలిసారి ట్విట్టర్ (ఎక్స్)వేదికగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఈ దాడులపై స్పందించారు. దాడులకు తెగబడుతున్న టిడిపి ముఠాలను అడ్డుకోవాలని, రాష్ట్రంలోని పరిస్థితులపై జోక్యం చేసుకోవాల్సిందిగా గవర్నర్ ని జగన్మోహన్ రెడ్డి కోరారు. 'రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానికి వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టిడిపి ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బికె లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్ళతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసీ ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చ మూకల అరాచకాలను అడ్డుకోవాలి. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టిడిపి దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం' అని జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ లో స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్