రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆదివారం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను చూసి ప్రజల సిగ్గుపడుతున్నారని, జగన్ మాత్రం సిగ్గు పడడం లేదన్నారు. జగన్ నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ప్రజల్లో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
హోం మంత్రి అనిత
రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆదివారం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను చూసి ప్రజల సిగ్గుపడుతున్నారని, జగన్ మాత్రం సిగ్గు పడడం లేదన్నారు. జగన్ నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ప్రజల్లో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలను ప్రాతిపదిక తీసుకుని ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించాలని డిమాండ్ చేశారు. హత్యలు, దాడులపై అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని, చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారని వీటికి సంబంధించిన ఆధారాలను తనకు ఇవ్వాలని మంత్రి కోరారు.
డేటా లేకుండా ఆరోపణలు చేస్తే సరికాదని, తాను అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజకీయంగా జరిగిన హత్యలు నాలుగు మాత్రమేనని, ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి తెలిసి కూడా చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 45 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినవి ఏవి జరగలేదని తాను చెబుతున్నానని, జరిగినట్లు ఆధారాలు ఉంటే సమర్పించాలన్నారు. అబద్ధపు లెక్కలతో రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో రంగ నాయకమ్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారని సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారని, టిడిపి నాయకులు ఎందరి పైన కేసులు పెట్టారని వారంతా ఇప్పటికీ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారన్నారు. హత్య జరిగిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి పరామర్శించేందుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. తప్పుడు లెక్కలపై ఆధారాలు చూపించాలని స్పష్టం చేశారు. రాజకీయ హత్యలు ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు మాత్రమే జరిగాయని, వీటిలో ముగ్గురు టిడిపి కార్యకర్తలు చనిపోగా, ఒకరు వైసీపీ కార్యకర్త చనిపోయారన్నారు. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందన్నారు. రాజకీయంగా ఒక వేదిక కోసం జగన్ చూస్తున్నారని, దీనికి వినుకొండ ఘటనను ఆధారంగా చేసుకున్నారన్నారు. వినుకొండలో హత్యకు పాల్పడిన వ్యక్తి వైయస్ భారతి, జగన్మోహన్ రెడ్డితో కూడా సెల్ఫీలు దిగాడని, మిమ్మల్ని కూడా అరెస్టు చేయాలా.? అని మంత్రి ప్రశ్నించారు. చంపుకోవడం తప్పని, దానిపై వెంటనే చర్యలు కూడా తీసుకున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.