శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అర్హత లేకపోయినా సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ రెడ్డి వాహనాన్ని లోపలికి అనుమతించిన విషయాన్ని గుర్తించాలన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్
శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అర్హత లేకపోయినా సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ రెడ్డి వాహనాన్ని లోపలికి అనుమతించిన విషయాన్ని గుర్తించాలన్నారు. అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయాల్సిన అతన్ని వైసీపీ నేతలు అభ్యర్థన మేరకు ముందే ప్రమాణ స్వీకారం చేయించామన్నారు. ప్రజలు జగన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకపోయినా అతను టిడిపి మీద ఏడవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇతరులను నిందించడం మానాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహృదయంతో ఆలోచించడం వల్లే ప్రమాణ స్వీకారం రోజు జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం దక్కిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కీలక హామీలు అమలుకు సంబంధించిన సంతకాలు చేశారని, మిగిలిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతోపాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి పరుగులు పెడుతుందన్నారు. ఇప్పటికే ఆయన స్పష్టమైన ఆదేశాలను మంత్రులకు ఎమ్మెల్యేలకు అందించారని, ఆ దిశగానే తాము పనిచేస్తున్నామని వెల్లడించారు.