వైసీపీ అధినేత జగన్ కు ప్రాణహాని ఉందా..? హైకోర్టును అందుకే ఆశ్రయించారా.!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా..? తనకు కల్పించిన రక్షణను పునరుద్ధరించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం వెనుక కారణం అదేనా.? అంటే సర్వత్ర అవునన్న సమాధానమే వినిపిస్తోంది. రాజకీయ నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

YS Jaganmohan Reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా..? తనకు కల్పించిన రక్షణను పునరుద్ధరించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం వెనుక కారణం అదేనా.? అంటే సర్వత్ర అవునన్న సమాధానమే వినిపిస్తోంది. రాజకీయ నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేది. దీన్ని కూటమి ప్రభుత్వం తాజాగా కుదించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కోటమి ప్రధాన లక్ష్యమని, తనకు ప్రాణహాని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహాని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని ఈ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. గత నెల మూడో తేదీ నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్ లో కోర్టును కోరారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్ అసాల్ట్ టీమ్స్, జామర్లను కూడా అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

అయితే జగన్మోహన్ రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ కు ప్రాణహాని ఉందన్నది ఆ పార్టీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ వ్యక్తం అవుతున్న అభిప్రాయం. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పై ఎయిర్పోర్టులో కోడి కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయమే అయింది. ఆ తరువాత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ గులకరాళ్ళతో ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ జగన్ మోహన్ రెడ్డికి గతంలో కల్పించిన బాధ్యతను పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తాజాగా జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. అధికారంలో ఉండగా ఈ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డికి భారీగా భద్రతను కేటాయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతను తగ్గించడం వల్ల ఇబ్బంది నెలకుంటుందన్న ఉద్దేశంతోనే హైకోర్టును ఆయన ఆశ్రయించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్