బంగ్లాదేశ్ లో నెలకొన్న చిచ్చు వెనక విదేశీ హస్తం ఉందా..? రాజకీయ నిపుణుల విశ్లేషణ

బాంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఏర్పడిన కల్లోల పరిస్థితులు వెనుక విదేశీ హస్తం ఉందన్న అనుమానం సర్వత్ర వ్యక్తమవుతోంది. ఆ దేశాన్ని నిఘా వర్గాలు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు ఈ కుట్ర పన్నారు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా కుట్ర అని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతుండగా, మొన్నటిదాకా జైల్లో ఉన్న ప్రతిపక్ష బీఎన్పీ నేత ఖలీదా జియా కుమారుడు తారీఖ్ రెహమాన్ పాకిస్తానీ గూడచార సంస్థ ఐఎస్ఐతో కలిసి లండన్ లో పన్నిన వ్యూహం అని, దీనికి చైనా మద్దతు కూడా ఉందని బంగ్లాదేశ్ అధికారులు కొందరు చెబుతున్నారు.

Agitators carrying out attacks in Bangladesh

బంగ్లాదేశ్ లో దాడులకు పాల్పడుతున్న ఆందోళనకారులు

బాంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఏర్పడిన కల్లోల పరిస్థితులు వెనుక విదేశీ హస్తం ఉందన్న అనుమానం సర్వత్ర వ్యక్తమవుతోంది. ఆ దేశాన్ని నిఘా వర్గాలు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు ఈ కుట్ర పన్నారు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా కుట్ర అని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతుండగా, మొన్నటిదాకా జైల్లో ఉన్న ప్రతిపక్ష బీఎన్పీ నేత ఖలీదా జియా కుమారుడు తారీఖ్ రెహమాన్ పాకిస్తానీ గూడచార సంస్థ ఐఎస్ఐతో కలిసి లండన్ లో పన్నిన వ్యూహం అని, దీనికి చైనా మద్దతు కూడా ఉందని బంగ్లాదేశ్ అధికారులు కొందరు చెబుతున్నారు. తారీక్ అన్వర్ ఐఎస్ఐ ప్రతినిధుల మధ్య సౌదీ అరేబియాలో పలుమార్లు సమావేశాలు కూడా జరిగాయనడానికి తమ వద్ద ఆధారాలున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు. భారత వ్యతిరేక జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగమైన ఇస్లామి చాత్ర శిబిర్ (ఐసిఎస్) ఆందోళనలకు ఆజ్యం పోసిందని, ఇందుకు అవసరమైన సొమ్మును పాకిస్తాన్ లో ఉన్న చైనా సంస్థల నుంచి ఐసిఎస్ కు అందిందన్న ఆరోపణలు ఉన్నాయి. భారత్ కు అనుకూలంగా ఉండే హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలంగా ఉండే బిఎన్పిని అధికారంలోకి తెచ్చుకునేందుకు పాక్ ఐఎస్ఐ ఈ సాయం చేసిందన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది మే 23న షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు ఈ కుట్ర వెనుక అమెరికా హస్తం ఉందన్న వాదనకు 

ఊతమిచ్చేదిగా ఉందని పలువురు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పట్లో ఆవామీ లీగ్ నేతృత్వంలోని 14 పార్టీల కూటమి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఆమె ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇండోనేషియా భూభాగంలోని కొంత భూభాగాన్ని విడదీసి ఈస్ట్ తైమూర్ అనే క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి కొంత భూభాగం తీసుకొని అక్కడ ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయడానికి విదేశీ కుట్ర జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. జనవరి 7న జరిగిన ఎన్నికలకు ముందు రోజు ఒక శ్వేత జాతి వ్యక్తి (వైట్ మాన్) తనను కలిశారని, బాంగ్లాదేశ్ లో తమ దేశ వైమానిక స్థావరం ఏర్పాటుకు అనుమతిస్తే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవామీ లీగ్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తామని తనకు ఆఫర్ ఇచ్చారని హసీనా వివరించారు. బంగ్లాదేశ్ లో ఎయిర్ బేస్ నిర్మాణానికి, ఆ దేశానికి తాను అనుమతి ఇచ్చి ఉంటే తనకు ఏ సమస్య ఉండేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. 

నిశితంగా పరిస్థితులను గమనిస్తున్న భారత్ 

బాంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. షేక్ హసీనాకు మద్దతుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అక్కడ ప్రజల మనోభావాలు పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న ఘర్షణల్లో కూడా ఆందోళనకారులు భారత్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ రాజకీయ నిపుణులు పేర్కొన్నారు. హసీనాకు భారత్ సహాయం చేస్తోందని ఆందోళనకారులు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్ లో ఎవరు అధికారంలో ఉన్న దౌత్య సంబంధాలు కొనసాగిస్తామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ ప్రకటించారు. ఇక బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం, హసీనా ప్రభుత్వ పతనం నేపథ్యంలో ఇక్కడి మైనారిటీలు మరోసారి ప్రమాదంలో పడతారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో ఉన్న సుమారు 19 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 

హసీనా నుంచి దేశ అత్యవసర సందేశంతోనే అనుమతి.. 

బంగ్లా ప్రధాని హసీనా ప్రస్తుతం షాక్ లో ఉన్నారని, కోలుకున్నాక ఆమెతో మాట్లాడతామని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. మానవతా దృక్పథంతోనే ఆమెకు ఆశ్రయం ఇచ్చామని, భవిష్యత్తుపై నిర్ణయానికి సమయం ఇద్దామన్నారు. తక్షణం భారత్ కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ హసీనా నుంచి సంక్షిప్త సందేశం వచ్చిందని ఎంపీలకు వివరించారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఢాకాలో ఆందోళనకారులు సమావేశం కావడంతో పరిస్థితి తీవ్రత తెలిసిన ఆమె భద్రతాధికారులతో సమావేశమై రాజీనామా నిర్ణయం తీసుకొని ఉండవచ్చన్నారు. హసీనా వినతితో బంగ్లాదేశ్ నుంచి విమానం రాకకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. దశాబ్దాలుగా బంగ్లాదేశ్ తో తమకున్న సన్నిహిత సంబంధాలు ప్రస్తుతం అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్