రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టి సారిస్తానన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖల తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
పవన్ కల్యాణ్
రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టి సారిస్తానన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖల తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం తనకు కలిగిందన్న పవన్.. ఎర్ర చందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. అడవులు వినాశనానికి పాల్పడితే ఎంటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. సామాజిక వనాలు పెంచాల్సిన అవసరం ఉందన్న పవన్.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రితోపాటు అటవీ పర్యావరణ, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎర్ర చందనం యఽథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోందని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.