కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణ.. ముడా ఇంటి స్థలాల కుంభకోణంలో

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ధావర్ చంద్ గహ్లాత్ అనుమతులను మంజూరు చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముడాలో 14 ఇంటి స్థలాలను తన సతీమణి పార్వతి పేరుతో అక్రమంగా తీసుకున్నారని సిద్ధరామయ్యపై ఆరోపణలు వస్తున్నాయి. సీఎం ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

CM Siddaramaiah

సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ధావర్ చంద్ గహ్లాత్ అనుమతులను మంజూరు చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముడాలో 14 ఇంటి స్థలాలను తన సతీమణి పార్వతి పేరుతో అక్రమంగా తీసుకున్నారని సిద్ధరామయ్యపై ఆరోపణలు వస్తున్నాయి. సీఎం ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులంతా హుటహుటిన బెంగుళూరుకు బయలుదేరారు. సిద్ధరామయ్య పై ప్రాసిక్యూషన్ కు అనుమతులు ఇచ్చిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్, సీఎం కార్యదర్శి, అదనపు ముఖ్య కార్యదర్శి అతీశ్ కు రాజ్ భవన్ నుంచి అందాయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారని, ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వడం ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని బిజెపి, జేడీఎస్ కు చెందిన రాష్ట్ర నాయకులు కొందరు ఈ కుట్రకు సూత్రధారులని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. రాజీనామా చేసే అంత తప్పు తానేమే చేయలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అధిష్టానం అండగా ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇంచార్జ్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి సీఎంకు ఫోన్ చేసిన ఆయన ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ పరంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై డీకే శివకుమార్ కూడా స్పందించారు.

రాజ్ భవన్ వేదికగా తప్పుడు ఫిర్యాదుతో సీఎం సిద్ధరామయ్యను ఇరికించాలనే కుట్ర సాగిందని, ముఖ్యమంత్రికి అండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ముడా ఆరోపణలపై ప్రాసిక్యూషన్ కు అనుమతులు ఇచ్చిన వెంటనే పలువురు సహచర మంత్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య తమ ముఖ్యమంత్రి అని, ఆయన అదే హోదాలో ఉంటారని ఎవరి ఒత్తిళ్లకు తలోగ్గేది ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని, ఇండియా కూటమి మొత్తం ముఖ్యమంత్రిగా అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో శనివారం రాత్రి కర్ణాటక క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి నిర్ణయాన్ని క్యాబినెట్ ఖండించింది. సీఎంకు మద్దతుగా ఉండాలని, న్యాయపోరాటం చేయాలని తీర్మానించింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని క్యాబినెట్ లో తీర్మానించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్యపై ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ హైకోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ గవర్నర్ నేరుగా సీఎంకు అనుమతులు ఇచ్చారని, కోర్టు ద్వారా స్టే పొందే అవకాశం ఉంటుందని అన్నారు.  అందుకే ముందుగానే కేవియట్ దాఖలు చేశానని స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధరామయ్య వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్