దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాలు విజయం సాధించి సత్తా చాటారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కొద్దిరోజులు కిందట జరిగాయి. ఈ ఉప ఎన్నికలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, ఇండియా కూటమికి చెందిన పార్టీలు పది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటారు.
ఉప ఎన్నిక
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాలు విజయం సాధించి సత్తా చాటారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కొద్దిరోజులు కిందట జరిగాయి. ఈ ఉప ఎన్నికలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, ఇండియా కూటమికి చెందిన పార్టీలు పది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటారు. ఆయా స్థానాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జూలై పదో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా, మరో మూడు చోట్ల ఎన్‌డీఏ ప్రభుత్వం ఉంది. శనివారం కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించగా, ఎన్‌డీఏ కూటమికి షాక్ కొట్టేలా ఫలితాలు వెలువడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై తొమ్మిది వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. నాలాఘడ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్‌దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయాన్ని సాధించారు. ఇక హమీర్‌పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరు మీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇక్కడ రాయ్‌గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్‌తలా స్థానాల్లో తృణమూల్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఉత్తరాఖండ్‌లోని మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్తానంలోడీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ, మధ్య ప్రదేశ్‌లోని అమర్‌వాడాలో బీజేపీ కమలేష్ షా, బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ విజయం సాధించారు.