రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అనేక హామీలను ఇచ్చారు. అనుకున్నట్టుగానే కూటమి భారీ మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. 164 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కూటమి నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
సూపర్ సిక్స్ హామీలు
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అనేక హామీలను ఇచ్చారు. అనుకున్నట్టుగానే కూటమి భారీ మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. 164 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కూటమి నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రధానంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వం ముందున్న పెద్ద టాస్క్‌గా చెప్పవచ్చు. వీటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.1500, స్కూల్‌కు వెళ్లే చిన్నారుల తల్లులకు తల్లికి వందనం పథకంలో భాగంగా అందించే రూ.15 వేలు రూపాయల ఆర్థిక సాయం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ, నిరుద్యోగులకు ప్రతినెల రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లించడం వంటి హామీలు అమలు ప్రభుత్వం ముందున్న పెద్ద లక్ష్యాలుగా చెప్పవచ్చు.
వీటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న ప్రశ్న లబ్ధిదారులు నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఆయా హామీలను అమలు చేయడంపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు అనుగుణంగా విధి, విధానాలను తయారు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలిసింది. అదే సమయంలో రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఉంటారు, ఎవరికి నిరుద్యోగ భృతి చెల్లించాలన్న దానిపైనా సీఎం కసరత్తు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు నుంచి అమలు చేయడంపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి అమ్మకి వందనం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. ఏది ఏమైనా ఏడాదిలోనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.