కాల్పులు జరిగిన చోటే మరోసారి ర్యాలీ నిర్వహిస్తా : డోనాల్డ్ ట్రంప్

పెన్సిల్వేనియాలో కొద్ది రోజుల కిందట నిర్వహించిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రంప్ పై జరిగిన దాడిని ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు ఖండించారు. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ ముందంజలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిగాయని, అయితే తనపై కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మరోసారి ర్యాలీని నిర్వహిస్తానని ట్రంప్ తాజాగా ప్రకటించారు.

donald trump

దుండగుడి కాల్పుల్లో గాయపడిన ట్రంప్

పెన్సిల్వేనియాలో కొద్ది రోజుల కిందట నిర్వహించిన ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రంప్ పై జరిగిన దాడిని ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు ఖండించారు. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ ముందంజలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిగాయని, అయితే తనపై కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మరోసారి ర్యాలీని నిర్వహిస్తానని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు. తమ ప్రియమైన ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ తనపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్ కు తిరిగి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను త్వరలోనే తెలియజేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ట్రంప్ ధైర్యసాహసాలను ఈ సందర్భంగా పలువురు కొనియాడుతున్నారు. దాడి జరిగిన చోటుకే వెళ్లి మరోసారి ర్యాలీ నిర్వహించడం సాధారణ విషయం కాదంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనలో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరి కంపెరాటోర్ ప్రాణాలు కోల్పోయారు. తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో దుండగుడు తూటాకు బలయ్యాడు. తాజాగా జరిగిన బహిరంగ సభలో ట్రంప్ అతని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు. కాగా మళ్లీ ఫైర్ ఫైటర్ కోరి గౌరవార్ధం సభను నిర్వహించనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్