Union Budget : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీగా వరాలు.. అమరావతికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి భారీగా నిధులను కేటాయించారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయాన్ని అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అందుకు అనుగుణంగానే నిధులను కూడా కేటాయిస్తామని వెల్లడించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Union Finance Minister Nirmala Sitharaman

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి భారీగా నిధులను కేటాయించారు.  కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయాన్ని అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అందుకు అనుగుణంగానే నిధులను కూడా కేటాయిస్తామని వెల్లడించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. 2024 - 25 బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లు ఆమె ప్రకటించారు. భవిష్యత్ లోనూ రాజధాని అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులను అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి అవసరమైన విధులను అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా అందించనున్నట్లు ఆమె వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామని వివరించారు. అదే విధంగా విశాఖ - చెన్నై - ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నట్లు వివరించారు.

విభజన చట్టంలో పొందుపరిచినటువంటి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని కూడా ఆమె తెలియజేశారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి అండగా ఉంటామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన తోడ్పాటున అందిస్తామన్నారు. బీహార్, ఏపీలో పూర్వోదయ పథకం అమలు చేస్తామని వివరించారు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక సాయాన్ని అందిస్తామన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. విశాఖ - చెన్నై - ఓర్వకల్లు - బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ కు నిధులను కేటాయించినట్లు ఆమె వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రకటన పట్ల కూటమి నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు కూటమి నాయకులు చెబుతున్నారు.  రానున్న రోజుల్లోనూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి సహకారం అందుతుందన్న ఆశాభావాన్ని కూటమికి చెందిన నాయకులు వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్