పార్టీ వీడనున్న నేతలపై వైసీపీ సీనియర్ల హాట్ కామెంట్స్.. ఎవరేమన్నారంటే..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలువురు రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయబోతున్నారన్న చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ పోతుల సునీత టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే బాటలో మరి కొంతమంది పయనించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసిపి కు చెందిన రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Kakani Govardhan Reddy and Ambati Rambabu

కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలువురు రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయబోతున్నారన్న చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ పోతుల సునీత టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే బాటలో మరి కొంతమంది పయనించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసిపి కు చెందిన రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు పార్టీ మార్పుపై స్పందించిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబునాయుడుకు చివరికి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిన విషయాన్ని ఈ సందర్భంగా కాకాని గుర్తు చేశారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా..? అని ప్రశ్నించారు. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారని, ప్రజల దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో పార్టీ మారిన వారు కాలగర్భంలో కలిసిపోయారని, పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. 

పరువు పోతుందే తప్పా.. ప్రజాదరణ పొందలేరు 

పార్టీ మార్పు వ్యవహారం పై మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన స్పందనను వెల్లడించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకుంటున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకుంటున్నారన్న అంబటి.. ప్రజాదరణ మాత్రం పొందలేకపోతున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చారిత్రక సత్యం అంటూ ఆయన పేర్కొన్నారు. వీరితోపాటు పలువురు మాజీ మంత్రులు కూడా పార్టీ మారుతారు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ఎంతమంది పార్టీ మారిన వైసిపి బలంగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్