బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. ఎల్లుండి జగిత్యాల బంద్‌‌కు హిందూ ఐక్య వేదిక పిలుపు

బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్య వేదిక-జగిత్యాల శాఖ.. జగిత్యాల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది.

jagtial news

జగిత్యాల

జగిత్యాల, ఈవార్తలు: బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్య వేదిక-జగిత్యాల శాఖ.. జగిత్యాల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 13న (మంగళవారం) స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ శాంతియుతంగా బంద్ పాటించాలని కోరింది. ‘సేవ్ బంగ్లాదేశ్ హిందూస్’ అని నినాదాన్నిచ్చింది. ఈ మేరకు బంద్ పాటించాలని  వ్యాపార సంస్థల నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండ కొనసాగుతూనే ఉంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన వేల మంది హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఇప్పటికే బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఆ దేశ సుప్రీం చీఫ్ జస్టిస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇక, బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల(హిందువులు)పై దాడులు తీవ్రం కావటంతో పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు వెయ్యి కుటుంబాలు బెంగాల్‌లోని కూచ్ బెహార్‌ రిజర్వాయర్‌లో నిలబడి భారత్‌లోకి అనుమతించాలని భారత సైనికులను వేడుకున్నారు. జైశ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలు చేసి అభ్యర్థించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్