ఉన్నత విద్య సమూల ప్రక్షాళనకు నాంది : మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేష్

గడచిన ఐదేళ్లలో ఉన్నత విద్యను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉన్నత విద్యను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఏడాదిలో ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. యూనివర్సిటీల ర్యాంకులు మెరుగుపర్చాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకు అనుగుణంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Minister Nara Lokesh

మంత్రి నారా లోకేష్




గడచిన ఐదేళ్లలో ఉన్నత విద్యను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉన్నత విద్యను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఏడాదిలో ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. యూనివర్సిటీల ర్యాంకులు మెరుగుపర్చాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకు అనుగుణంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను అప్డేట్ చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ నాలుగేళ్లు చదివినా రాని ఉద్యోగం అమీర్పేటలో నాలుగు నెలల శిక్షణతో ఎలా వస్తుందని.? అనే ప్రశ్నను ఈ సందర్భంగా ఆయన లేవనెత్తారు. ఇకపై ఇతర శిక్షణలో అవసరం లేకుండా కేవలం చదువుతూనే ఉద్యోగాలు వచ్చేలా కాలేజీల్లో తగిన శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసి ప్రమాణాల పెంపునకు కృషి చేద్దామని అధికారులను కోరారు.

గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా దీవెన, వసతి దీవెన ఫీజులు చెల్లింపు విధానం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురి చేసిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోయాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైసిపి ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టిందని వెల్లడించారు. విద్యా సంస్థలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. యూనివర్సిటీలో నాణ్యమైన పాలన అందించే విధంగా సమర్థవంతమైన అధికారులను నియమించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా విశ్వవిద్యాలయాలు నడిచేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల పేర్లు మార్చడంతోపాటు ఈ విధానాన్ని మార్చనున్నట్లు ఆయన వివరించారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో మాదిరిగానే కాలేజీలకు చెల్లించే పరిస్థితిని మళ్లీ తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల విద్యార్థులకు ఫీజుల ఇబ్బందులు ఉండవని, కాలేజీ యాజమాన్యాలు, ప్రభుత్వమే ఫీజులు గురించి చర్చించుకుంటాయని స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్