టిడిపి ఆఫీస్ దాడి కేసులో బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసిపి ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసిపి నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ స్పందిస్తూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేసామన్నారు. దీనిపై అత్యవసరంగా విచారం జరపాలని అభ్యర్థించారు.

AP High Court

ఏపీ హైకోర్టు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసిపి ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసిపి నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ స్పందిస్తూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేసామన్నారు. దీనిపై అత్యవసరంగా విచారం జరపాలని అభ్యర్థించారు. పోలీసులు తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చెబుతున్నట్టు ఇదేమీ చిన్న వ్యవహారం కాదని, 2021లో అప్పటి అధికార పార్టీ ప్రోద్బలంతో టిడిపి కార్యాలయంపై వందల మంది దాడి చేశారన్నారు. ఈ దాడి ఘటన మొత్తం ఆరు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందన్నారు. మరో వ్యాజ్యం బుధవారం విచారణకు రానుంది. ప్రస్తుతం వ్యాజ్యాలను కూడా ఆ పిటిషన్ కు జత చేయాలని ఆయన కోరారు. సీనియర్ న్యాయవాది రవిచందర్ న్యాయవాది స్పందిస్తూ వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం తాను విచారణకు హాజరుకాలేనని, తన వాదనలను వినాలని అభ్యర్థించారు.  అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృష్ణ సాగర్ అవినాష్ వ్యాజ్యంపై మధ్యాహ్నం విచారించారు.

సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు. కేసులో ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ పై కేసు నమోదు చేశారని, పిటీషనర్ ప్రోత్సాహంతోనే టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఫిర్యాదుదారుడికి అయింది సాధారణ గాయమేనని, డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత పోలీసులు హై ప్రొఫైల్ కేసుగా మార్చారని, కేసులో ఇతర నిందితులకు సిఆర్పిసి సెక్షన్ 41 (ఏ) నోటీసులు ఇచ్చి పిటిషనర్ కు ఇవ్వలేదన్నారు. అరెస్టు చేయాలని ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని వివరించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పిటిషనర్కు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మభ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రవిచందర్ కోరారు. పిటిషనర్ తరఫు వాదనలు ముగియడంతో పోలీసులు తరపు వాదనల కోసం న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

అలాగే సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై మూక దాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసును విచారణను కూడా బుధవారానికి వాయిదా వేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్