తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలితకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు శనివారం ఉదయం చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేలా కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలితకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు శనివారం ఉదయం చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేలా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, ఆమెకు సంబంధించిన 11,344 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు, 7,040 గ్రాముల బరువైన 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి ఆభరణాలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్లు, ఒక వీడియో కెమెరా, నాలుగు సిడి ప్లేయర్లు, రెండు ఆడియో డెక్కులు, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, మూడు ఐరన్ లాకర్లతో పాటు ఇతర విలువైన వస్తువులను కర్ణాటక అధికారులు న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగించనున్నారు. వీటిని అప్పగించే క్రమంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు చేశారు. ఈ అప్పగింత ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను న్యాయమూర్తి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోనే వీటిని తమిళనాడు అధికారులకు కర్ణాటక అధికారులు అందించనున్నారు.
గతంలో జయలలితకు సంబంధించిన ఈ ఆస్తులు, వస్తువులను పొందేందుకు కొందరు ప్రయత్నించారు. జయలలిత బంధువులమంటూ దీప, దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. జయలలితకు సంబంధించిన ఆభరణాలు, ఆస్తులు, వస్తువులను తమకు అప్పగించాలంటూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19న ఆదేశాలను కోర్టు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో వీటిని స్వాధీనం చేసుకునేందుకు 2024 మార్చి 6 7 తేదీల్లో అధికారిక బంధాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు సూచించింది. అంతలోనే దీప, దీపక్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలిత వస్తువుల అప్పగింతపై గత ఏడాది మార్చే ఐదున హైకోర్టు స్టే విధించింది. ఆ తరువాత దీప, దీపకులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు వస్తువుల అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయ లలితకు స్పెషల్ కోర్టు 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక వివాదాలకు కారణమయ్యాయి. ఆమె మృతి చెందిన తర్వాత ఆస్తులను ఎవరికి అప్పగించాలన్న దానిపై కోర్టు ఆదేశాల మేరకు తాజాగా చర్యలను చేపడుతున్నారు.