హిందూ ఆలయాలకు ఎండోమెంట్ బోర్డు నుంచి విముక్తి కల్పిద్దాం.. హైందవ శంఖారావం సభకు ఏకంగా 7 లక్షల మంది

ప్రభుత్వ ఆధీనంలో నుంచి దేవాలయాలను విముక్తి చేసేందుకు ‘‘హైందవ శంఖారావం’’ పూరిద్దాం - హిందూ శక్తిని ప్రదర్శిద్దాం..! అవును.. ఇన్నాళ్లకు ఆ ఆలోచన ఉద్యమ రూపం దాల్చింది.

haindava shankaravam

హైందవ శంఖారావం

కదులుదాం..! ఊరు.. వాడ కలిసికట్టుగా తరలుదాం..!! ప్రభుత్వ ఆధీనంలో నుంచి దేవాలయాలను విముక్తి చేసేందుకు ‘‘హైందవ శంఖారావం’’  పూరిద్దాం - హిందూ శక్తిని ప్రదర్శిద్దాం..! అవును.. ఇన్నాళ్లకు ఆ ఆలోచన ఉద్యమ రూపం దాల్చింది. మసీదులు, చర్చిలు ఆయా మతస్థులవారి ఆధీనంలోనే ఉండగా.. దేవాలయాలు మాత్రం ప్రభుత్వాధిరంలో ఎందుకు ఉండాలి..? అనేది అందరి మదిని తొలిచే ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు కోసం విశ్వహిందూ పరిషత్‌ ఆందోళన బాట పట్టింది. మసీదులు, చర్చిల మాదిరే మా దేవాలయాలు మాకు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్‌ ఉద్యమిస్తోంది. సెక్యురిజం అన్నప్పుడు అన్ని మతాలకు సమాన దూరం పాటించాలి.. సమాన గౌరవం ఇవ్వాలి. కానీ హిందుత్వాన్ని అంటరానిదిగా చేసి,మిగతా వారిని గుండెలకు హత్తుకోవడం  ఏంటి..? అనే ప్రశ్నకు జవాబు కోసం విశ్వహిందూ పరిషత్‌ తిరుగుబాటు చేపడుతోంది. ప్రజాస్వామ్యంలో సెక్యూరిజం ప్రకారం అన్ని మతాలు సమానమే.!  మరి హిందువులపై ఎందుకు ఇంతటి వివక్ష ..? అని గర్జించేందుకు విశ్వహిందూ పరిషత్‌ సిద్ధమైంది. దేవాలయాల ఆస్తులు , ఆదాయం ప్రభుత్వాలకు... ప్రభుత్వాల ఆదాయం, ఆస్తులు మసీదులు చర్చిలకా..? ఇదెక్కడి న్యాయం..? అంటూ గళం విప్పుతోంది. స్వాతంత్రానంతరం దశాబ్దాలుగా హిందూ ఆలయాలు దోచుకున్నది చాలు. ఇక మా ఆస్తులు, మా అస్తిత్వం మాకే కావాలని విజయవాడ కేంద్రంగా విశ్వహిందూ పరిషత్‌ శంఖారావం పూరిస్తోంది. రాజకీయాలు ,కులాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి హిందువు స్వచ్ఛందంగా కదిలి వచ్చి హైందవ శక్తి ప్రదర్శించేందుకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది వీహెచ్‌పీ

‘ప్రభుత్వాలు దిగి వచ్చేలా చేసి, మన ఆలయాల ఆలనా పాలన మనమే చేసుకుందాం. ఎండోమెంట్‌ పేరుతో  అధికారులు, పాలకులు దేవాలయాలపై పూర్తిగా పెత్తనం చెలాయిస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా, రాజకీయ నిరాశ్రయులకు ఆశ్రమం కల్పించేలా పాలకుల వ్యవహారాన్ని ఇక సాగనివ్వం. ‘‘అంటూ ప్రతి ఒక్కరూ పిడికిలి బిగిద్దాం. దేవాదాయం అంటే ఆ దేవుడిదే. ఆ దేవుడిని ఆరాధించే భక్తులదే. కానీ, దేవుడిపై విశ్వాసాలు లేని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేలా చేపడుతున్న చర్యలకు నిలదీద్దాం అంటూ.. విశ్వహిందూ పరిషత్‌ గర్జిస్తోంది. కాలనీ స్థాయిలోని మందిరం నుంచి  మొదలుకొని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వరకు బోర్డులు, కమిటీలు ఏర్పాటు చేసి భగవంతుని బందీ చేస్తున్న వ్యక్తులకు అవగాహన కల్పిద్దాం అంటూ.. విశ్వహిందూ పరిషత్‌ హిందువులను తట్టి లేపుతోంది. భక్తి లేకపోవడం అటు ఉంచితే, అసలు అన్యమతస్తులకు , మాజీ నక్సలైట్లకు సైతం భగవంతుడి బోర్డు కు చైర్మన్లుగా చేసి పెద్ద అపచారం చేస్తున్న పాలకులకు కనువిప్పు చేసేందుకు చర్యలు చేపట్టింది. అర్చక పురోహితులపై ఆధిపత్యం చెలాయిస్తూ.. దేవుడి సొమ్ముతో జల్సాలు చేస్తూ.. ప్రోటోకాల్‌ అంటూ దేవుడి దగ్గర హంగామాలు చేసే నీచ రాజకీయాల నుంచి దేవాలయాలను విముక్తి చేద్దామంటూ నినదిస్తోంది విశ్వహిందూ పరిషత్‌.

దేవాలయాల భూములన్నీ ఎండోమెంట్‌ పేరుతో ప్రభుత్వం తమకబందహస్తాల్లో ఉంచుకొని పలు రకాలుగా వాడేసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు,పేదలకు పక్కా ఇల్లు నిర్మిస్తోంది. వివిధ పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తోంది. తమకు తోచిన రీతిలో నచ్చిన వ్యక్తులకు లీజు పేరుతో  వివిధ రకాలుగా అడ్డదారుల్లో దేవాలయాల భూములను ప్రభుత్వం అధికారికంగా కబ్జా చేస్తుంది.  కానీ , వక్‌  ఫు భూములు, మిగతా చర్చిల ఆస్తుల విషయంలో నోరు మెదపడం లేదు. పైగా,  కావలసినన్ని ప్రభుత్వ భూములను  వక్‌ పు, చర్చిలకు దాన ధర్మం చేస్తుంది. ముఖ్యంగా నేడు చర్చిలు గా ఉంటున్న అనేక స్థలాలను కూడా ప్రభుత్వం లీజుకు ఇచ్చి క్రైస్తవుల మెప్పు పొందుతుంది.  వేలాది చర్చిల లీజు గడువు ముగిసినా వాటి గురించి మాట మాట్లాడడం లేదు. ఇవి సరిపోవు అన్నట్లుగా అదనంగా ప్రభుత్వ ఖజానా నుంచే ఇమామ్లకు, పాస్టర్లకు జీతాలు కూడా చెల్లిస్తోంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అదే సందర్భంలో దీప దూప నైవేద్యం, అర్చక పురోహితులకు ఇస్తున్న ఖర్చుల విషయంలో అనేక అవరోధాలు సృష్టిస్తూ హిందువులను తీవ్రంగా హింసిస్తోంది.  ఆదాయం (హుండీ) వచ్చే ఆలయాలపై ఎండోమెంట్‌  అధికారులు గద్దల్లా వచ్చి వాలిపోయి ఆస్తులన్నీ హరించి వేస్తున్నారు. కానీ, దేవాలయాల అభివృద్ధి మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి లెక్కకు మించిన వివక్ష హిందువులపై కొనసాగించి, హిందుత్వం అంటేనే అంటరానిదిగా చిత్రీకరిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులను నెత్తిన ఎక్కించుకొని సకల మర్యాదలు చేస్తున్నారు.

వద్దన్నా ఇఫ్తార్‌ విందులు , క్రిస్మస్‌ తోఫా, రంజాన్‌ తోఫా ఇస్తున్నారు. హిందువుల పండుగలకు మాత్రం అధిక రేట్లు పెంచి వ్యాపారం చేస్తున్నారు. టికెట్ల రూపంలో భక్తుడిని చుట్టుముట్టి రక్తాన్ని పీల్చేస్తున్నారు. జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇటువంటి అనేక సమస్యలు మన చుట్టూ మనం చూస్తూనే ఉన్నాం. చివరకు మన గ్రామాల్లో గ్రామ దేవతకు కొబ్బరికాయ కొట్టాలన్న కూడా పన్ను చెల్లించాలి. దేవుని దర్శించుకోవాలంటే గ్రేడ్ల వారిగా నిర్ణయించి, ఒక్కో గ్రేడుకు ఒక్కో రేటు టికెట్‌ ధర వసూలు చేస్తూ భక్తుల జేబులు ఖాళీ చేస్తున్నారు.’’ అయినవారికి ఆకుల్లో -కాని వారికి కంచాల్లో’’ అన్నట్లు గ్రామస్థాయిలోని పేరు మోసిన దేవాదాయం నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఆయా అధికారిక పార్టీ నేతలతో ప్రజాప్రతినిధులు దేవుడు సొమ్ముతో ప్రభుత్వ లాంఛనాలతో రాచ మర్యాదలు, ఆశీర్వచనాలు ఉచితంగా అందిస్తున్నారు. వేలాది రూపాయలు విలువ చేసే ప్రసాదాలు, శాలువాలు  అందించి రాజకీయ నేతల మన్ననలు పొందుతున్నారు ఎండోమెంట్‌ అధికారులు.  అదే దేవాలయాలకు సాధారణ భక్తులు వస్తే రకరకాలుగా టికెట్లు నిర్ణయిస్తూ.. ప్రసాదాల పేరుతో దండుకొని భక్తుడిని నడ్డి విరగొడుతున్నారు. వచ్చిన ఆదాయమంతా తమ ఖాతాలో వేసుకుని ఇతర మతస్తులకు పప్పు బెల్లాల మాదిరి పంచిపెడుతోంది ప్రభుత్వం. కాబట్టి ఇంతటి ఘోరమైన వివక్ష నుంచి హిందూ దేవాలయాలను విముక్తి చేసుకుందాం. హైందవ స్వాభిమానం సంరక్షించుకుందాం. హిందువులంతా సంఘటితమై జనవరి ఐదున విజయవాడలో నిర్వహించే లిహైందవ శంఖారావం సభలికు లక్షలాదిగా తరలుదాం. ప్రభుత్వ కబంధహస్తాల నుంచి దేవాలయాలను విముక్తి చేసుకుందాం. హైందవ శక్తి ప్రదర్శన చేసి హిందుత్వాన్ని నిలబెడదాం.

- పగుడాకుల బాలస్వామి

- ప్రచార ప్రసార ప్రముఖ్‌, వీహెచ్‌పీ

9912975753


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్