రుషికొండపై 500 కోట్ల ప్రధానంతో నిర్మించిన రాజకోట రహస్యం ఎన్నికలకు ముందే బహిర్గతమై ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. విశాఖ రుషికొండపై వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన విలాసవంతమైన భావన సముదాయంపై వైసిపి నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
రుషికొండపై 500 కోట్ల ప్రధానంతో నిర్మించిన రాజకోట రహస్యం ఎన్నికలకు ముందే బహిర్గతమై ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. విశాఖ రుషికొండపై వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన విలాసవంతమైన భావన సముదాయంపై వైసిపి నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిధులతో నిర్మించిన రాజకోట రహస్యం ఎన్నికల ముందే బయటపడి ఉంటే ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు. విశాఖలో రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు బస చేయడానికి ఐఎన్ఎస్ డేగా, నేవల్ గెస్ట్ హౌస్ వంటి నిర్దిష్ట విడిది ప్రాంతాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. వారి కోసం నిర్మించామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ రంగులతో ఈ భవనాన్ని నిర్మించడం దేనికి సంకేతమన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించి గతంలో ప్రభుత్వ పెద్దలు పూటకో మాట మాట్లాడారని, నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్ ను కనీసం భవనం ముందు ఏర్పాటు చేయలేదన్నారు. అత్యంత రహస్యంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. రుషికొండ భవన నిర్మాణంపై కుప్పిగంతులు, దాగుడుమూతలు ఎందుకు అని ప్రశ్నించారు. మొదట టూరిజం ప్రాజెక్టు అని చెప్పారని, ఆ తరువాత సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారని, ఆ తరువాత ఫైవ్ స్టార్ హోటల్ అంటూ మాట మార్చాలని గంటా విమర్శించారు. సెక్యూరిటీ కారణాల వల్ల చెప్పలేదంటూ ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సరైన అనుమతులు లేవని ప్రజా వేదికను కూల్చారని, ఈ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఈ నిర్మాణాన్ని ఎలా సాగించారని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.