ఏపీలో మరో కీలక హామీ అమలు దిశగా ప్రభుత్వం.. నైపుణ్య గణనకు ప్రత్యేక యాప్

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనేక ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక హామీలను ఇచ్చారు. వీటిలో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అనుగుణంగా నైపుణ్య గణన చేపడతామని అప్పట్లో ఇరువురు నేతలు అనేక సభల్లో వెల్లడించారు.

Chief Minister Nara Chandrababu Naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనేక ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక హామీలను ఇచ్చారు. వీటిలో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అనుగుణంగా నైపుణ్య గణన చేపడతామని అప్పట్లో ఇరువురు నేతలు అనేక సభల్లో వెల్లడించారు. తాజాగా ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం కూడా స్కిల్ సెన్సెస్ ఫైల్ పైనే చేశారు. ఈ ప్రోగ్రామ్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. నైపుణ్య గణనలో భాగంగా చదువుకున్న వారి వివరాలను పొందుపరచడంతోపాటు నైపుణ్యాలను వెలికి తీసే చర్యలను చేపట్టనుంది. 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసున్న వారి నైపుణ్యాలను గుర్తించేందుకు గణన ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రజల ఇష్టాలను తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కిల్ గణన కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చి ప్రజల నైపుణ్యాలను గుర్తించనుంది. వారు ఏఏ రంగాల్లో రాణించాలన్న ఆలోచనలో ఉన్నారో వంటి అంశాలను అందులో పొందుపరచునుంది. కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి వివరాలతోపాటు వ్యవసాయం సహా ఇతర చేతి వృత్తులు చేసుకునే వారి వివరాలను కూడా ఇందులో చేర్చనున్నారు. ఇలా చేయడం వల్ల ఏ రంగాల్లో ఎంతమంది ఉన్నారన్న దానిపై ప్రభుత్వానికి ఒక స్పష్టత రానుంది. అలాగే, యువతకు ఉన్న ఆసక్తి తెలుసుకొని వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఆయా రంగాల్లో మరింత మెరుగైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు.    ఈ యాప్ లో యువతకు సంబంధించిన నైపుణ్యాలను పొందుపరచడం ద్వారా పరిశ్రమలను వీరితో అనుసంధానం చేసి వారి నైపుణ్యాలకు అనుగుణమైన పరిశ్రమల్లో ఉపాధి కల్పించనున్నారు. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ అధికారులను భాగస్వాములను చేయనున్నారు.  కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను పట్టాలెక్కించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే యాప్ లో ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఫోన్ నెంబర్ కి వచ్చే ఓటిపి ద్వారా లాగిన్ కావచ్చు. అందులో వ్యక్తిగత వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఏపీకి చెందిన వారైతే ఈ యాప్ లో తమ వివరాలను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో విధానంలో కూడా వివరాలు పొందుపరిచే వెసులుబాటు ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి ఈ యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఒక్కొక్కరు 20 మంది వివరాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్