సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త.. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే తెలంగాణలోని అభ్యర్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సివిల్స్ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా కొత్త పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రజా భవన్ లో శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు

CM Revanth Reddy

 సీఎం రేవంత్ రెడ్డి 

సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే తెలంగాణలోని అభ్యర్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సివిల్స్ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా కొత్త పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రజా భవన్ లో శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రారంభించడంపై అభ్యర్థులకు స్పష్టతనిచ్చారు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా రానున్న రోజుల్లో ఎక్కువ మంది సివిల్స్ లో సత్తా చాటేందుకు అవకాశం ఉంటుందన్న భావనను రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.

ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభ ఉన్న ఎంతో మంది సివిల్స్ లాంటి ఉన్నత స్థాయి పరీక్షలకు సిద్ధం అవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పథకం ద్వారా సివిల్స్ కు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆర్థికంగా భరోసాను కల్పించనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తాజా పథకం వల్ల ఏటా వందలాదిమంది సువిల్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మేలు చేకూరానున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇదిలా ఉంటే సీఎం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్