|| ముఖ్యమంత్రి జగన్||
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లాలోని తెనాలిలో మార్కెట్‌యార్డులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలో నాలుగో సంవత్సరంలో మూడో విడత వైయస్సార్ రైతు భరోసా రూ. 2 వేలు నగదు జమ చేశారు. ప్రతి సంవత్సరం రూ.13,500ల రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నాలుగేళ్లలో ఇప్పటివరకు రూ. 54 వేల భరోసా సాయం అందించామని తెలిపారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా తమ హామీ 12,500 ఇస్తానని చెప్పిన కూడా రైతులకు భరోసా అందించడానికి దీనిని రూ. 13,500 గా అందించి ఇప్పటివరకు నాలుగో సంవత్సరం పూర్తయిందని తెలిపారు. నాలుగో సంవత్సరంలో రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. ఇప్పుడు మూడో విడతగా రూ.2 వేలు తమ ఖాతాల్లో జమ చేసామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను జమ చేశారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు కూడా సాయం అందించామని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టాలు జరగకుండా తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.