ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల ఏర్పాటు

సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 100 ప్రాంతాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

Anna canteen

అన్నా క్యాంటీన్

సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 100 ప్రాంతాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. అన్న క్యాంటీన్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కిచెన్ ఏర్పాటుతోపాటు అన్న క్యాంటీన్లో వడ్డించాల్సిన భోజనం, ఇతర కూరగాయలు వంటి వాటి గురించి కూడా అధికారులకు ఆయన కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాబోయే వారం రోజులపాటు మున్సిపల్ కమిషనర్లు అన్న కాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలోని 33 మున్సిపాలిటీలో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మరో 83 క్యాంటీన్లు ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. మరో 20 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలలోగా అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో ఎన్నడూ లేన విధంగా అన్న క్యాంటీన్లలో పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అతి తక్కువ ధరకే భోజనం అందించనున్నారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ అన్న క్యాంటీన్లను నిర్వహించారు. అయితే వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా మూసేశారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించే చర్యలను ప్రభుత్వ పెద్దలు వేగవంతం చేస్తున్నారు. మూడు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు ఆగస్టు 15 నాటికి 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్