సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

సీఎం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనవరాలి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

Revanth Malla reddy

సీఎం రేవంత్ రెడ్డితో మల్లా రెడ్డి భేటీ

 సీఎం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనవరాలి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా తన మనవరాలి వివాహానికి రావాలని పెళ్లి పత్రికను సీఎంకు మల్లారెడ్డి అందించారు. రెండు రోజుల క్రితం ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబును మల్లారెడ్డి కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను ఆహ్వానిస్తున్నారు.

గతంలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టారు. దాంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే  మల్లారెడ్డి చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని మల్లారెడ్డి అనుచరులు ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్