హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్‌గా మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు.
బీఆర్ గవాయ్
హైదరాబాద్, డిసెంబర్ 19 (ఈవార్తలు): హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్‌గా మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. రాజ్యాంగం, న్యాయ లభ్యత వంటి అంశాల్లో రిసెర్చ్, బోధన, విద్యా పరమైన కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు. అలాగే, డాక్టర్ అనురాగ్ భాస్కర్‌ను అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా, చైర్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. సీనియర్ అడ్వకేట్ కే పరమేశ్వర్‌ను కూడా అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా నియమించింది.