చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి రాష్ట్రంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

Nara Chandrababu

నారా చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి రాష్ట్రంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి పార్టీలు విజయాన్ని నమోదు చేయడంతో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్‌ను ప్రమాణ స్వీకారానికి వేదికగా నిర్ణయించారు. 70 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్