తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఐదుగురికి చాన్స్‌..!

కేంద్రంలో మూడోసారి కొలువుదీరుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. గత రెండుసార్లు కేంద్రం మంత్రివర్గంలో ఈ స్థాయిలో తెలుగు ఎంపీలకు అవకాశం దక్కలేదు. తొలిసారిగా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రులకుగా అవకాశం లభిస్తోంది.

Kishan Reddy, Rammohan Naidu

కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు


కేంద్రంలో మూడోసారి కొలువుదీరుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. గత రెండుసార్లు కేంద్రం మంత్రివర్గంలో ఈ స్థాయిలో తెలుగు ఎంపీలకు అవకాశం దక్కలేదు. తొలిసారిగా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రులకుగా అవకాశం లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు బీజేపీ నుంచి ఎన్నికైన శ్రీనివర్మకు ఏపీ నుంచి అవకాశం దక్కుతుండగా, తెలంగాణలో బీజేపీ నుంచి ఎంపికై కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం దక్కుతోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డి కేంద్రంలో మంత్రిగా పని చేస్తుండగా, తొలిసారి బండి సంజయ్‌కు మోదీ కేబినెట్‌లో అవకాశం దక్కుతోంది. ఇక, ఏపీ నుంచి అవకాశం దక్కించుకుంటున్న వారిలో రామ్మోహన్‌ నాయుడుకు తొలిసారిగా అవకాశం దక్కింది. గడిచిన రెండు ఎన్నికల్లో విజయం సాధించి రామ్మోహన్‌ నాయుడు తాజా ఎన్నికల్లోనూ విజయం సాఽధించడం ద్వారా ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. గతంలో రామ్మోహన్‌ నాయుడు తండ్రి ఎర్రంనాయుడు కూడా కేంద్రంలో మంత్రిగా పని చేశారు. అలాగే, టీడీపీ నుంచి తొలిసారి గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిచిన పెమ్మసానికి జాక్‌పాట్‌ తగిలింది. పార్లమెంట్‌లో అడుగుపెడుతూనే కేంద్ర మంత్రి అవుతున్నారు. బీజేపీ నుంచి గెలుపొందిన శ్రీనివాసవర్మ కూడా తొలిసారి గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్