సబితా ఇంద్రారెడ్డి పాంచ్ పటాకా.. మహేశ్వరంలో హ్యాట్రిక్ రికార్డు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు పత్రాన్ని అందుకుంటున్న సబితా ఇంద్రారెడ్డి||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

మహేశ్వరం నియోజకవర్గంలో మూడోసారి భారత రాష్ట్ర సమితి నుండి పోటీ చేసిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన అందేల  శ్రీరాములు యాదవ్ పై 26320 ఓట్ల తో ఘనవిజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుండి భారత రాష్ట్ర సమితికి చెందిన సబితా ఇంద్రారెడ్డి ఆదిత్యంలోనే కొనసాగుతూ ఉన్నారు. నాలుగో రౌండులో 1272, ఐదవ రౌండ్ లో 2721, ఆరవ రౌండులో 3365, ఏడవ రౌండ్ లో 4080, ఎనిమిదవ రౌండ్ లో 4725, తొమ్మిదవ రౌండ్లో 5427, పదో రౌండ్లో 6395, 11వ రౌండ్ లో బిజెపి 1546 మెజార్టీ వచ్చిన చివరగా 4849 ఓట్లతో బీఆర్ఎస్ అధికంగా ఉంది. 12వ రౌండ్లో 10763 అధికంలో కొనసాగింది. 13 14 రౌండ్ వచ్చేసరికి ఏకంగా 18412 అదే విధంగా 15 రౌండ్ వచ్చేసరికి 24448 ఆదిక్యం సాధించారు. 16 రౌండ్ లో భారతీయ జనతా పార్టీ కొంత 1608 మెజార్టీ వచ్చిన టిఆర్ఎస్ మెజార్టీ కొంత తగ్గించిన బిఆర్ఎస్ 22840 మెజార్టీ ఉంది. 17 రౌండ్ కి వచ్చేసరికి 23940 మెజార్టీ రాగా చివరగా సబితా ఇంద్రారెడ్డికి ఒక లక్ష 24 వేల 591 తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థికి 97,928 కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి 69,389 రాగా బి ఆర్ ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి 26320 ఓట్లతో ఘన విజయం సాధించారు.

హ్యాట్రిక్ సాధించిన సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గం లో సబితా ఇంద్రారెడ్డి మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009లో మొదటిసారి గెలుపొంది అదేవిధంగా 2018లో రెండోసారి విజయం సాధించారు తిరిగి మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని మూటగట్టుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మూడోసారి విజయంతో పాటు చేవెళ్లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఐదోసారి విజయం సాధించిన ఘనత సవిత ఇంద్రారెడ్డి కే దక్కుతుంది.

మహేశ్వరంలో సంబరాల్లో బీఆర్ఎస్ నాయకులు

బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించడంతో నియోజకవర్గంలో కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. నియోజకవర్గంలోని బడంగ్ పేట మీర్పేట కార్పొరేషన్ ఆర్కే పురం సరూర్నగర్ డివిజన్ జల్పల్లి తుక్కుగూడ మున్సిపాలిటీలు కందుకూరు మహేశ్వరం మండలాల్లో టిఆర్ఎస్ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కందుకూరు రిటర్నింగ్ అధికారి సూరజ్ కుమార్ గెలుపు పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తన గెలుపు కోసం కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతారని పేర్కొన్నారు. తన బలం బలగం మహేశ్వరం అని నియోజకవర్గ ప్రజలే అని ఆశీర్వాదాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు అనుబంధ ప్రింట్ ఎలక్ట్రానిక్స్ మీడియాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్