కుమారుడి అరెస్టుపై మాజీ మంత్రి జోగి సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు వార్నింగ్

అగ్రిగోల్డ్ భూముల స్కామ్ లో తన కుమారుడిని అరెస్టు చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు నాయుడుకు కొడుకు ఉన్న సంగతి మర్చిపోవద్దు అంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఇంటిపై తాను దాడి చేయడానికి వెళ్లలేదని, కేవలం చంద్రబాబును కలిసేందుకు వెళ్లినట్టు తెలిపారు.

former minister jogi ramesh

మాజీ మంత్రి జోగి రమేష్

అగ్రిగోల్డ్ భూముల స్కామ్ లో తన కుమారుడిని అరెస్టు చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు నాయుడుకు కొడుకు ఉన్న సంగతి మర్చిపోవద్దు అంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఇంటిపై తాను దాడి చేయడానికి వెళ్లలేదని, కేవలం చంద్రబాబును కలిసేందుకు వెళ్లినట్టు తెలిపారు. ఈ ఘటనను మనసులో పెట్టుకొని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందన్న రీతిలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ తెలియజేసేందుకు మాత్రమే చంద్రబాబు ఇంటికి అప్పుడు వెళ్ళనట్టు స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసి నిరసన తెలియజేసి వ్యవస్థను సరి చేయాలని చెప్పేందుకే అలా చేసినట్లు వెల్లడించారు. అప్పుడు జరిగిన విషయాన్ని చంద్రబాబు, లోకేష్ మనసులో పెట్టుకొని తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఇప్పటి  వరకు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదని, మంచి చేస్తే మంచి చేశారని చెబుతానని వివరించారు. ఇంత వరకు అలాంటి మంచి పని చేసినట్లు కనిపించలేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, కక్ష సాధింపులకే ప్రభుత్వానికి సమయం సరిపోతోందని జోగ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి కోపం ఉంటే తనపై తీర్చుకోవాలని స్పష్టం చేశారు. అంతేకానీ ఏమీ తెలియని తన కుమారుడిని అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. పత్రికల్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని కేసులు పెట్టి వేధించడం ఏమిటన్నారు. అగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్ లో ఉన్నాయని, అటాచ్మెంట్ లో ఉన్న భూములను ఎవరైనా కొనుగోలు చేస్తారా..? అని ప్రశ్నించారు. కేవలం రెండు వేల ఎకరాల కోసం కక్కుర్తి పడతామా.? అని ప్రశ్నించారు. తాము కొన్న భూములు కూడా చట్ట ప్రకారమే కొనుగోలు చేస్తామన్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన తర్వాతే క్రయ, విక్రయాలు జరిపామని వివరించారు. చట్టప్రకారం చేసిన క్రయ, విక్రయాలపై కూడా ఇలాంటి కేసులు పెట్టి అమాయకులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో ఉండొచ్చని, తర్వాత వేరే వాళ్ళు అధికారంలోకి రావచ్చన్నారు. చంద్రబాబుకి కూడా కొడుకు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు అని జోగి రమేష్ హెచ్చరించారు. మీ ఇంటి నుంచి మా ఇళ్ళు ఎంత దూరమో, మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. అన్నింటిని మర్చిపోయి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేయాలో ఆలోచించాలని సూచించారు. వాటిని అమలు చేయకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్