మాజీ సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నాయకుడితో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Ayyanna Patrudu

చింతకాయల అయ్యన్నపాత్రుడు


తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నాయకుడితో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అయ్యన్నపాత్రుడు మరో వ్యక్తితో మాట్లాడుతున్నారు. అవతల వ్యక్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని, చనిపోలేదన్నారు. ధన బలం, కుల బలం అధికంగా ఉందని, పక్క రాష్ట్రంలోని ప్రభుత్వంలో కూడా జగన్ మనుషులు ఉన్నారంటూ పేర్కొన్నారు. జగన్ లేవకుండా కొట్టాలి అన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు కూడా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారే తప్ప చనిపోలేదని పేర్కొన్నారు. మీరు చెప్పారు కదా ఓడిపోయాడు కానీ చావలేదని, అది మంచి డైలాగ్ అని అయ్యన్నపాత్రుడు అన్నారు. దీనికి స్పందించిన ఆ పెద్దాయన డబ్బుకు అమ్ముడు పోనివాడు దేశంలో ఎవడు లేడని, ఆ డబ్బు, పవర్ ఇప్పటికీ ఆయనకీ ఉన్నాయని జగన్ ఉద్దేశించి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అయ్యన్నపాత్రుడు.. ఓడిపోయాడు కానీ చావలా అనే డైలాగ్ బాగుందని, పామును చచ్చే వరకు కొట్టాలన్నారు. ప్రస్తుతం ఈ మాటలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. గతంలో కూడా జగన్ పై అయన పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు అనేకసార్లు చేశారు. వీలు చిక్కినప్పుడల్లా జగన్ టార్గెట్గా అయ్యన్న విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుండడం గమనార్హం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్