ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం పది మంది సభ్యుల పదవీ కాలం మార్చి 29న ముగియనున్న నేపథ్యంలో ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం పది మంది సభ్యుల పదవీ కాలం మార్చి 29న ముగియనున్న నేపథ్యంలో ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 3న నోటిఫికేషన్, మార్చి 20వ తేదీన పోలింగ్, అదే రోజున కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏపీ నుంచి జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీ తిరుమలనాయుడు, యనమల రామకృష్ణుడుతో పాటు తెలంగాణ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గే మల్లేశం, మిర్జా రియాజుల్ హసన్ ఎఫెండీల పదవీ కాలం ముగియనుంది. వీరి స్థానాల్లో ఎన్నిక జరగనుంది.
ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
నోటిఫికేషన్ : 03-03-2025
నామినేషన్లకు చివరి తేది : 10-03-2025
నామినేషన్ల స్క్రుటినీ : 11-03-2025
నామినేషన్ల ఉపసంహరణ : 13-03-2025
పోలింగ్ తేది : 20-03-2025
పోలింగ్ సమయం : ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
కౌంటింగ్ : 20-03-2025 (సాయంత్రం 5 గంటలకు)
ఎన్నికలు ముగియాల్సిన తేది : 24-03-2025