తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం ఊరట

తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి అనుమతి ఇవ్వకుండా ఆపిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఓకే చెప్పింది. మంత్రి వర్గ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కేబినెట్ నిర్వహణకు పలు షరతులు విధించింది.

revanth reddy cabinet meeting
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి అనుమతి ఇవ్వకుండా ఆపిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఓకే చెప్పింది. మంత్రి వర్గ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కేబినెట్ నిర్వహణకు పలు షరతులు విధించింది. అత్యవసర విషయాలు, తక్షణం అమలు చేసే అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండే జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర విషయాలు, అప్పటి వరకు వేచి ఉండే అవకాశం లేనటువంటి అంశాలపై చర్చించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పని చేసిన అధికారులు ఎట్టిపరిస్థితుల్లో కేబినెట్ సమావేశానికి హాజరు కావొద్దని తేల్చిచెప్పింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్