|| ప్రతీకాత్మక చిత్రం ||
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 428 పేజీలతో కూడిన రెండో ఛార్జ్ షీట్ ను ఈడీ విడుదల చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరో 17 మంది కీలక వ్యక్తులపై ఈడీ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అలాగే ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ మరో సారి ప్రస్తావించింది. మరోవైపు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా ఈడీ ఛార్జిషీట్ నమోదు చేసింది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు ఈడీ నమోదు చేయడంతో ఎన్ని మలుపులు తిరుగుతోందా.. అని దేశ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇక క్యాంప్ ఆఫీస్ లోనే ఇదంతా నడిచిందని ఈడీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను 65 మందిని ఈడీ ప్రశ్నించింది. స్కాన్ కేసులో 120 శాతం లాభాలు వచ్చేలా రూపకల్పన చేసి ప్రభుత్వానికి రూ.2,873కోట్ల నష్టం వాటిల్లేలా చేశారని ఈడీ వెల్లడించింది.