|| బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ||
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుమానితురాలుగా కోర్టు వెల్లడించింది. మార్చి 20 వ తేదిన విచారణకు స్వయంగా హాజరుకావలసిందిగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈరోజు హాజరు కావాల్సిన ఈడీ విచారణకు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ పూర్తి అయిన తర్వాతే ఈడీ విచారణకు వస్తానని లాయర్ తో సమాచారం అందించారు. తర్వాత హైడ్రామా ప్లే చేసి అనారోగ్య కారణాలవల్ల రాలేదని విచారణ కోసం ఇంకో రోజు కేటాయించాలని లాయర్ తో లేఖ పంపించారు. అనంతరం కవిత, మంత్రి హరీష్ రావు, సత్యవతి ఢిల్లీ నుండి హైదరాబాదుకు పయనమయ్యారు. ఈ మేరకు ఈడీ విచారణ కోసం మార్చి 20న రావాలని ఆదేశిస్తూ మరోసారి నోటీసులు పంపారు. అయితే ఈరోజు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి ఎంఎల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత హాజరు కాకపోగా, పిళ్లైని కోర్టులో గురువారం ప్రవేశపెట్టింది. కానీ, విచారణ కోసం వీరిద్దరిని ఎదురెదురుగా విచారించేనందుకు పిళ్లై కస్టడీని సోమవారం వరకు వాయిదా వేశారు. అయితే సోమవారం రోజున కవిత ఈడీ విచారణకు హాజరవుతుందా.. లేదా? అనే దానిపై ప్రతిపక్ష పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ కోసం కవిత ఎలాంటి సన్నహాలు వేస్తుందో తెలుసుకోవాలంటే మార్చి 20(సోమవారం) వరకు ఎదురుచూడాల్సిందే..