ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించవద్దన్న ఈసీ

పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సీల్ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పంపించారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా


పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సీల్ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పంపించారు. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని, ఫామ్ 13 ఏ పై ఆర్ వో సంతకం తో పాటు అన్ని వివరాలు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఆర్వో సంతకం సహా బ్యాలెట్ ను ధ్రువీకరించే రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని సూచించింది. ఫామ్ 13 ఏలో ఓటరు, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ ఏవీ లేకుంటే అటువంటి వాటిని మాత్రమే తిరస్కరించవచ్చని ఈసీ స్పష్టం చేసింది. ఇది ఎలా ఉంటే ఓట్ల లెక్కింపు దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం పోలీసులకు సూచనలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని, అటువంటి ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఈసీ రాష్ట్ర పోలీస్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్