శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అగ్రెసివ్ నేతగా పేరుగాంచిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా మరో మహిళతో కలిసి ఉంటున్నారంటూ ఆమె భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు కొద్ది రోజుల నుంచి తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మూడు రోజుల కిందట ఆయన ఇంటికి వెళ్లి మరి నిరసన తెలిపారు. ఈ వ్యవహారం మీడియా కథనాలతో బయటకు రాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలియజేస్తున్న భార్య వాణి
శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అగ్రెసివ్ నేతగా పేరుగాంచిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా మరో మహిళతో కలిసి ఉంటున్నారంటూ ఆమె భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు కొద్ది రోజుల నుంచి తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మూడు రోజుల కిందట ఆయన ఇంటికి వెళ్లి మరి నిరసన తెలిపారు. ఈ వ్యవహారం మీడియా కథనాలతో బయటకు రాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. తాజాగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చిచ్చుకు కారణమైనటువంటి మాధురి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన కారులోనే వేగంగా వెళుతూ మరో కారును ఢీకొట్టడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని ఆమె భావించినట్లు స్వయంగా మాధురి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రోడ్డు మీదకు వచ్చి మరి ఆయనపై విమర్శలు చేస్తుండడాన్ని జన సైనికులు సామాజిక మాధ్యమాలు వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తనకి ఇప్పుడు అర్థమైందంటూ దువ్వాడ శ్రీనివాస్ కూడా బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన మూడు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ మాత్రం మౌనాన్ని దాల్చింది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో జిల్లాలో పార్టీ పరువు పోయిందన్న భావన ఆ పార్టీ ముఖ్య నాయకుల్లో వ్యక్తం అవుతుంది. కానీ ఎవరు నోరు మెదపడం లేదు. కుటుంబ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలు, ఆరోపణలు మాత్రం వైసీపీకి తీవ్రస్థాయిలో డ్యామేజీ చేశాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది ఎలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ పై ఆమె భార్య వాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా శ్రీనివాస్ ఇంటి వద్దనే దీక్ష కొనసాగిస్తున్నారు. మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని బరితెగించి మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. తామంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నామని శ్రీను లో ఇప్పటికైనా మార్పు రావాలని కుటుంబ సభ్యులు తెలిపారు.