Doogee V Max | చార్జింగ్ పెట్టకున్నా నెల రోజులు పని చేసే ఫోన్.. బ్యాటరీ కెపాసిటీ తెలిస్తే షాకే

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||డూగీ వీ మ్యాక్స్ Photo: Twitter||

స్మార్ట్ ఫోన్ యుగం మనది. మనం వాడే ఫోన్‌కు చార్జింగ్ సమస్య కామన్. చార్జింగ్ సమస్య లేకుండా గంటలు గంటలు ఫోన్ వాడే అవకాశం ఉంటే బాగుండు.. అని ఆలోచించిన సందర్భాలు ఎన్నో. ఆ అవకాశం లేకే.. చార్జర్లతో, పవర్ బ్యాంకులను మోసుకెళ్తుంటాం. అయితే, ఆ సమస్యకు చెక్ పెట్టేలా డూగీ అనే సెల్‌ఫోన్ కంపెనీ వినూత్న ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలుసా.. ఏకంగా 22,000 ఎంఏహెచ్. చైనాకు చెందిన ఈ సెల్‌ఫోన్ కంపెనీ.. మూడు నెలల కిందటే మార్కెట్‌లోకి తెచ్చినా, పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. డూగీ వీ మ్యాక్స్ 5జీ మాడల్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌లో కెమెరాలు 108 ఎంపీ+20 ఎంపీ లెన్స్‌లు కలిగినవి.

అయితే, ఫోన్ బరువు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల్లో ఆదరణ సాధించలేకపోయిన ఈ ఫోన్.. రివర్స్ చార్జింగ్ కెపాసిటీ కూడా కలిగి ఉంది. అంటే.. వేరే ఫోన్లకు చార్జింగ్‌ను ఈ ఫోన్ నుంచి పెట్టొచ్చు. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ దీని సొంతం. అన్నట్టు ఈ ఫోన్ ధరెంతో తెలుసా.. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.51,500కు దొరుకుతోంది.

డూగీ వీ మ్యాక్స్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ - ఓఎస్,

ర్యామ్ - 12 జీబీ,

కనెక్టివిటీ - 5జీ

ఫ్రంట్ కెమెరా - 32 ఎంపీ

రేర్ కెమెరా - 108 ఎంపీ+16 ఎంపీ+20 ఎంపీ నైట్ విజన్

బ్యాటరీ కెపాసిటీ - 22,000 ఎంఏహెచ్

చార్జర్ - 33 వాట్స్

ఫోన్ స్టాండ్ బై - 720 గంటలు (30 రోజులు)

వెబ్ స్టోరీస్