విద్యార్థులు బట్టీ పట్టే విధానానికి దూరంగా ఉండాలని, బట్టీ పట్టే విధానంతో స్కోర్ పెరిగినా నైపుణ్యాలు పెరగవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇండోర్‌లోని అటల్ బీహరి వాజ్‌పేయీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండోర్ సహా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసిన పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా
విద్యార్థులు బట్టీ పట్టే విధానానికి దూరంగా ఉండాలని, బట్టీ పట్టే విధానంతో స్కోర్ పెరిగినా నైపుణ్యాలు పెరగవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇండోర్‌లోని అటల్ బీహరి వాజ్‌పేయీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండోర్ సహా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసిన పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బట్టీ పట్టి చదివే విధానానికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన విద్యా విధానం కింద ఏర్పాటు చేసిన పీఎం ఎక్స్‌లెన్స్‌లతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఒత్తిడితో కూడిన చదువుకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టంతో మాత్రమే పిల్లలు చదవడం ద్వారా మంచి స్థాయికి చేరుకుంటారన్నారు.
ముంబయిని ఆర్థిక రాజధానిగా చెబుతుంటామని, అదే మాదిరిగా మధ్యప్రదేశ్‌కు ఇండోర్ వాణిజ్య రాజధాని మాత్రమే కాదని, ఎడ్యుకేషన్ హబ్‌గా అవతరించిందన్నారు. నూతన విద్యావిధానం పరిమాణం కన్నా నాణ్యతపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు వివరించారు. మధ్యప్రదేశ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్న వెల్లడించారు. ఇండోర్ ఇప్పటి వరకు స్మార్ట్ సిటీగా, మెట్రో సిటీగా, క్లీన్ సిటీగా, మోడర్న్ సిటీగా అందరికీ తెలుసని, ఇకపై గ్రీన్ సిటీ కూడా అని పేర్కొన్నారు. భారీగా మొక్కలను పెంచడం ద్వారా మధ్యప్రదేశ్ యావత్ భారతదేశానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించే పని చేస్తోందన్నారు.