ఏసీ గదులకే పరిమితం కావద్దు.. ప్రజల ఆలోచనలను తెలుసుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఏసీ గదులకే పరిమితం కావద్దని, దీనివల్ల అధికారులకు కూడా సంతృప్తి ఉండదన్నారు. ప్రజలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు ఉండాలని, ఆ దిశగా అధికారులు ఆలోచన చేయాలని సూచించారు.

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఏసీ గదులకే  పరిమితం కావద్దని, దీనివల్ల అధికారులకు కూడా సంతృప్తి ఉండదన్నారు. ప్రజలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు ఉండాలని, ఆ దిశగా అధికారులు ఆలోచన చేయాలని సూచించారు. ముఖ్యంగా అధికారుల నిర్ణయాలు మానవీయ కోణంలో ఉండేలా చూడాలన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే సరైన సేవలు అందించవచ్చు అన్నారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులు ఏమిటన్న విషయాలపై అధికారులకు స్పష్టత ఉండాలి అన్నారు. జిల్లా స్థాయిలో పనిచేసే అధికారులు.. ఆయా జిల్లాలోని ప్రజలకు సంబంధించిన సమస్యలు, అవసరాలు, ఇబ్బందులు తెలుసుకోవడం చాలా కీలకమన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని, కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారన్నారు.

తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే సరైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, వీటిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా స్థాయిలోని కలెక్టర్లు, ఇతర అధికారులపై ఉందన్నారు. తొమ్మిది కీలక అంశాలతో ప్రభుత్వం అజెండా రూపొందించిందన్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, కాలానుగున పరిస్థితులు, ఆరోగ్యం, సేజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్యా, శాంతి భద్రతలు, ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదకద్రవ్యాలు వ్యతిరేక ప్రచారం తదితర అంశాలపై చర్చించారు.  ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపైనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా దిశా, నిర్దేశం చేయనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్