ప్రలోభాలకు లొంగ వద్దు.. ఎమ్మెల్సీలకు వైసీపీ అధినేత జగన్ సూచన

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో దఫదపాలుగా సమావేశం అవుతున్నారు. తాజాగా గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు.

YS Jagan Mohan Reddy

 వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 


సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో దఫదపాలుగా సమావేశం అవుతున్నారు. తాజాగా గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లోను కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, కూటమిగా వాళ్లు వచ్చిన మనకు 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్న విషయాన్ని గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేసి అధికారంలోకి వద్దామని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు భరోసా కల్పించారు. నాయకులు ధైర్యంగా ప్రజల మధ్య ఉండాలన్నారు. కేసులు పెట్టినా భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్సీలు ముందుకు సాగాలన్నారు. ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తించుకున్నారని, ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయని విమర్శించారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. టిడిపి బిజెపి జనసేన హనీమూన్ నడుస్తోందని, ఈ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇద్దామని వెల్లడించారు. ఆ తరువాత ప్రజా సమస్యలపై పోరాటాన్ని సాగిద్దామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో తమ నోళ్లను కట్టడి చేసే అవకాశం ఉందని, అయితే మండలిలో మాత్రం ప్రజా గళాన్ని వినిపిద్దామని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు సూచించారు. శాసన మండలిలో ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం ఉందని జగన్ ఎమ్మెల్సీలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైన దిశా, నిర్దేశం చేశారు జగన్. కొద్ది రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతోనే మమేకమవుదామని జగన్ స్పష్టం చేశారు. 2029లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్ ఎమ్మెల్సీలకు భరోసా కల్పించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్