తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రేషన్ కిట్లు అందించేందుకు వైసిపి సిద్ధమవుతోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లోని బాధితులకు 50 వేల రేషన్ కిట్లను తొలి దశలో ప్రజలకు అందించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు అందించే ఈ కిట్లలో కందిపప్పు, ఉప్మా రవ్వ, వంటనూనె, బెల్లం, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉన్నట్లు వైసిపి వెల్లడించింది. సిద్ధమైన రేషన్ కిట్లను శాసనమండలిలో ప్రతిపక్ష నేత మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పరిశీలించారు.
కిట్లు పరిశీలిస్తున్న బొత్స సత్యనారాయణ
తీవ్రమైన వరదలతో అల్లాడుతున్న విజయవాడ ప్రాంత ప్రజలకు ప్రతిపక్ష వైసిపి సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. వరదల వల్ల నష్టపోయిన వారికి కోటి రూపాయల సాయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అలాగే, ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల గౌరవ వేతనాన్ని కూడా బాధితులకు అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ రెండు దశల్లో వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు 1.75 లక్షల పాల ప్యాకెట్లను, మూడు లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేసింది. అలాగే స్థానిక నేతలు కూడా బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారాన్ని, పాల ప్యాకెట్లను, వస్త్రాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా దేవినేని అవినాష్, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మహేష్ తదితర నేతలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు వరద ప్రభావతి ప్రాంతాల్లో సాగాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రేషన్ కిట్లు అందించేందుకు వైసిపి సిద్ధమవుతోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లోని బాధితులకు 50 వేల రేషన్ కిట్లను తొలి దశలో ప్రజలకు అందించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు అందించే ఈ కిట్లలో కందిపప్పు, ఉప్మా రవ్వ, వంటనూనె, బెల్లం, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉన్నట్లు వైసిపి వెల్లడించింది. సిద్ధమైన రేషన్ కిట్లను శాసనమండలిలో ప్రతిపక్ష నేత మాజీమంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. ఈ కిట్లను ముంపు ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల్లో పంపు ప్రాంతాల్లోని ప్రజలకు వీటిని అందించనున్నారు. రెండో దశలో మరి కొంత మందికి ఈ కిట్లను అందించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయల సాయంపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారు, ఏం చేశారో చెప్పాలంటూ పలువురు సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపి తాము అందించే సాయానికి సంబంధించిన కిట్ల ఫోటోలను బయటకు విడుదల చేసింది. మాజీ మంత్రి బొత్స బస్సు సత్యనారాయణతోపాటు దేవినేని అవినాష్ తదితరులు ఈ కిట్లను పరిశీలిస్తున్న ఫోటోలు ప్రస్తుతం బయటికి వచ్చాయి. ఈ ఫోటోలు ద్వారా వైసీపీని ప్రశ్నిస్తున్న వారికి సమాధానాన్ని వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇస్తున్నారు. తాము, తమ అధినేత చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటామని, చెప్పిన మాటను తప్పే రకం కాదంటూ వైసీపీ శ్రేణులు ఘాటుగానే ఆయా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ కిట్ల పంపిణీ ప్రక్రియను విజయవాడకు చెందిన నేతలు దగ్గరుండి పర్యవేక్షించునున్నారు. ఏయే ప్రాంతాలకు ఈ కిట్లు వెళతాయనే దానిపై వైసీపీ నేతలు నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఒక్కో కిట్ లో 10 వరకు వస్తువులు ఉండటంతో లబ్ధిదారులకు మేలు కలుగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.