కూటమిలో విభేదాలు.. పవన్ వ్యాఖ్యలు వెనుక కారణం అదేనా.!

ఏపీలో కూటమి ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య జరుగుతున్న వాగ్వాదం, గొడవలు ఓటమి నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం చేస్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో ఈ విభేదాలు రోజురోజుకు పెరుగుతుండడంతో కూటమి మధ్య సఖ్యత లోపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి నాయకులను పట్టించుకోవడం లేదు. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. ఇదే రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమవుతోంది.

Home Minister Anita, Janasena chief Pawan

హోం మంత్రి అనిత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఏపీలో కూటమి ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య జరుగుతున్న వాగ్వాదం, గొడవలు ఓటమి నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం చేస్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో ఈ విభేదాలు రోజురోజుకు పెరుగుతుండడంతో కూటమి మధ్య సఖ్యత లోపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి నాయకులను పట్టించుకోవడం లేదు. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. ఇదే రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమవుతోంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు అగ్ర నాయకులు ప్రయత్నించాల్సిన సమయంలో.. వారి మధ్య కూడా ఈ తరహా వివాదాలు పతాక స్థాయికి చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోం మంత్రి ఆయన తన ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రచ్చకు కారణం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. కూటమి బంధాన్ని బలోపేతం చేయాల్సిన పవన్ కళ్యాణ్.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా మరింత వివాదాలను రాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ విమర్శల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ హోం మంత్రిని లక్ష్యంగా చేసుకొని ఈ తరహా వ్యాఖ్యలు చేశారని, ఒకరకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేలా ఆయన వ్యవహరించారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలను చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కూటమి ధర్మాన్ని విస్మరించారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

వ్యాఖ్యలు వెనక ఉద్దేశం అవేనా.?

రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో జనసేన నేతలను టిడిపి నాయకులు పట్టించుకోవడం లేదు. అధికారాన్ని టిడిపి నాయకులు మాత్రమే అనుభవిస్తున్నారు. జనసేన కార్యకర్తలను కనీసం పట్టించుకోకపోగా.. వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర నేతల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోతే.. తాను కూడా అదే తరహాలో గౌరవాన్ని ఇవ్వబోనన్న విషయాన్ని తెలియజేసేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి పార్టీల మధ్య నెలకొన్న ఈ రగడ రానున్న రోజుల్లో తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అదే జరిగితే పొత్తు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా గడవకముందే కూటమి నాయకులు ఈ స్థాయిలో గొడవలు ఆడుకుంటుంటే.. భవిష్యత్తులో ఇవి మరింత అగ్గి రాజేస్తాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఈ వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేలా నాయకులు వ్యవహరిస్తారా.? లేదా అన్నది చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్