వచ్చే నెల ఒకటో తేదీన పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే నెల ఒకటో తేదీన పిఠాపురంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలోనూ జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు.

Deputy CM Pawan Kalyan

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 


జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే నెల ఒకటో తేదీన పిఠాపురంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలోనూ జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు భారీ విజయాన్ని అందించిన పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళనున్నారు. అదేరోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహించి పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలను పవన్ కళ్యాణ్ తెలపనన్నారు. పిఠాపురం పర్యట అనంతరం మూడు రోజులపాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనతో పాటు ఓటమి పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్ కు అండగా ఉన్న నేపథ్యంలో ఆయన తన తొలి పర్యటన ఇక్కడి నుంచే ప్రారంభిస్తుండడం గమనార్హం. యాల తరబడి ఈ ప్రాంతంలో నెలకొన్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చిన ప్రజలు.. వాటిని పరిష్కరించడం పైన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 29న కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వెళ్ళనున్నారు. 

వివిధ శాఖలపై సమీక్ష 

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం లేకుండా పనిచేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన కీలక సూచనలు చేశారు. అసెంబ్లీకి వచ్చేటప్పుడు అన్ని అంశాల పైన అవగాహనతో రావాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్