అసెంబ్లీ గేటు తాకనివ్వనన్న మాటలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ కొందరు చేసిన వ్యాఖ్యలను పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారన్నారు. గేటు తాకడం కాదని, దాన్ని బద్దలు కొట్టుకుని పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతారంటూ టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయంటూ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan on a visit to Pithapuram

పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్


జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ కొందరు చేసిన వ్యాఖ్యలను పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారన్నారు. గేటు తాకడం కాదని, దాన్ని బద్దలు కొట్టుకుని పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతారంటూ టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయంటూ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న మనిషికి అండగా నివాలనుకుంటున్నట్టు వివరించారు. ఇక్కడి ప్రజలు డిప్యూటీ సీఎందాకా తీసుకువచ్చారని, 100 శాతం స్ర్టైక్‌ రేట్‌తో దేశంలో ఇప్పటి వరకు చూడని ఫలితాలను అందించారన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారని, దాన్ని ఇక్కడి ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారన్నారు. చాలా మంది తనను హోంశాఖ తీసుకోమని చెప్పారని, కానీ, బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే తాను పంచాయతీరాజ్‌శాఖ తీసుకున్నట్టు వెల్లడించారు. తనకు ఎలాంటి లంచాలు అవసరం లేదని, నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పినట్టు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఉండడంటూ వైసీపీ నాయకులు గతంలో విమర్శలు చేశారని, అందుకు తాను మూడు ఎకరాలు భూమి కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ కూడా చేయించుకున్నట్టు వివరించారు. తొమ్మిది నెలలు క్రితం బిడ్డ కనిపించకుండా పోయిందంటూ ఒక మహిళ తనకు వచ్చి ఫిర్యాదు చేసిందని, తొమ్మిది రోజుల్లోనే అమ్మాయిని పట్టుకునేలా చేశామన్నారు.

 వైసీపీ ప్రభుత్వ హయాంలో 30 వేల మందికిపైగా ఆడ బిడ్డలు కనిపించకుండా పోతే పట్టించుకోలేదని, వ్యవస్థల్లో తప్పు లేదని ఈ ఘటనతో నిరూపితమైందన్నారు. వ్యవస్థలను సరిదిద్దుకోవాలని అధికారులకు కూడా చెబుతున్నానన్నారు. 151 స్థానాలు ఉన్న వైసీపీని 11 స్థానాలకు ప్రజలు పడగొట్టారని, బస్సులు, రైళ్లలో వచ్చి ప్రజలు ఓటేసి వెళ్లారన్నారు. ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టిన సమయంలో కూడా ఎవరికీ ఇంత మెజారిటీ రాలేదన్నారు. రుషికొండకు చేసిన రూ.600 కోట్ల ఖర్చులో కొంచమైనా కేటాయించి రోడ్లు బాగుపడేవన్నారు. ఉద్యోగులకు జీతాలు అందేవని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్