రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన : ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య నేపథ్యంలో ట్విట్టర్ వేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీని అనగదొక్కాలనే కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Jaganmohan Reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య నేపథ్యంలో ట్విట్టర్ వేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీని అనగదొక్కాలనే కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్టగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.

ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరు స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటిని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వినుకొండలో టిడిపి కార్యకర్తలు చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్