జగన్ నివాసం లోటస్పాండ్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులో ఉన్న లోటస్పాండ్ లోని అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పలుమార్లు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదులు అందడంతో శనివారం మధ్యాహ్నం అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

lotuspond

 లోటస్పాండ్


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులో ఉన్న లోటస్పాండ్ లోని అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పలుమార్లు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదులు అందడంతో శనివారం మధ్యాహ్నం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. లోటస్ పాండ్ వాడక ఆనుకొని ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల కోసం చేపట్టిన నిర్మాణాలను జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు. ప్రోక్లైన్లతో ఈ నిర్మాణాలను పోలీసుల ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున జిహెచ్ఎంసి అధికారులు ఈ నిర్మాణాలను తొలగించే పనులు నిమగ్నమై ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే ఈ పనులు సాగుతున్న సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో జిహెచ్ఎంసి అధికారులు ఈ పనులను చురుగ్గా చేపడుతున్నారు. జిహెచ్ఎంసి అధికారులు చేపట్టిన ఈ పనులు పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సమస్యలు తగ్గుతాయని పలువురు స్థానికులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనూ అనేక చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల అక్రమ కట్టడాలు ఉన్నాయని, వీటి పైన చంద్రబాబును నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం దృష్టి సారిస్తుందని పలువురు చెబుతున్నారు. గతంలో జగన్ అధికారంలో ఉండగా అనేక చోట్ల టిడిపి నాయకులకు చెందిన నిర్మాణాలను అక్రమ కట్టడాలు పేరుతో కూల్చివేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ నూతనంగా కొలువు దీరిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ తరహా నిర్మాణాలపై కఠినంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్