||కొల్లూరు వంశీ, రామిడి శ్రీనివాసరెడ్డి||
(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు విజృంభిస్తోందని, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ జోరు బాగా కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రామిడి శ్రీనివాసరెడ్డి, కొల్లూరు వంశీ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా రోజురోజుకు ప్రజల్లోకి చొచ్చుకుపోతోందని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని వెల్లడించారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి అనేకమంది నాయకులు చేరుతున్నారని, ఇందుకోసం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాతరెడ్డి చక్రం తిప్పుతున్నారని వివరించారు. మహేశ్వరంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడెప్పుడో కట్టిన నాగార్జునసాగర్, పోచంపాడు ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందని అధికార బీఆర్ఎస్ సర్కారును వారు ప్రశ్నించారు కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.