Congress Manifesto | తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలివీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కాంగ్రెస్ పార్టీ Photo: Twitter||

ఈవార్తలు, గాంధీభవన్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు 36 అంశాలను అందులో చేర్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలివే..

1. మహాలక్ష్మి: మహిళలకు ప్రతి నెల రూ.2500, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

2. రైతు భరోసా ప్రతి ఏటా: రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌

3. గృహజ్యోతి: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

4. ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లులేని వారికి ఇంటి స్థలం-రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.

5. యువ వికాసం: విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌.

6. చేయూత: రూ.4వేల నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్య శ్రీ బీమా


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్