నాకు సమాధి కట్టాలని కాంగ్రెస్ కలలు కంటోంది.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రధాని నరేంద్ర మోదీ Photo: twitter||

ఈవార్తలు, నేషనల్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తనకు సమాధి తవ్వాలని ఆ పార్టీ కలలు కంటోందని ఆరోపించారు. అయితే, తాను దేశాభివృద్ధి, పేదల అభివృద్ధిపై దృష్టి సారించానని, తాను ఆ పనిలోనే నిమగ్నమయ్యానని తెలిపారు. ఆదివారం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ వేల కోట్లు దోచుకుందని మండిపడ్డారు. కానీ, డబుల్ ఇంజిన్ సర్కారు అయిన బీజేపీ మాత్రం దేశాభివృద్ధికి ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. 

‘తాము దేశాభివృద్ధికి పాటుపడుతుంటే.. కాంగ్రెస్, ఇతర పార్టీలు మాత్రం మోదీకి సమాధి తవ్వాలని కలలు కంటోంది. కానీ, దేశ ప్రజల ఆశీర్వాదం నాకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆ విషయం వారికి తెలియదు’ అని విమర్శించారు. ఆ పార్టీలు ఎన్ని చేసినా తాను మాత్రం ప్రజలను బాగుచేసే పనిలోనే బిజీగా ఉంటానని స్పష్టం చేశారు.

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ఏడాదిలోనే ఆయన ఆరు సార్లు కర్ణాటకలో పర్యటించారు. తాజా పర్యటనలో రూ.8,480 కోట్లతో నిర్మించిన 118 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ వేను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రహదారితో బెంగళూరు-మైసూర్ మధ్య ప్రయాణ సమయం 75 నిమిషాలకు తగ్గుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్