అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. లక్ష్యం అదేనా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జైయేశ్ రంజన్ కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెనుక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆదివారం న్యూజెర్సీలోని తెలంగాణ ప్రవాసులతో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Chief Minister Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జైయేశ్ రంజన్ కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెనుక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆదివారం న్యూజెర్సీలోని తెలంగాణ ప్రవాసులతో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రవాసులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రవాసులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందించడమే కాకుండా రాయితీలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఉన్న ప్రవాసులు ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఆమెరికా పర్యటన అనంతరం ఈ నెల 11న అమెరికా నుంచి బయలుదేరి దక్షిణ కొరియా రాజధాని సీయోల్ కు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి, అధికారులతో కూడిన బృందం చేరుకోనుంది. సీయోలో వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచి కూడా భారీ ఎత్తున పెట్టుబడును ఆకర్షించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పర్యటన అనంతరం ఈ నెల 14న ఉదయం 10.50 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 

ప్రముఖ కంపెనీలను ఆహ్వానించడం పెట్టుబడులను, రాబట్టడమే లక్ష్యం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన వెనక ఉద్దేశం పెట్టుబడును రాబట్టడమే. ఇప్పటికే తెలంగాణ ప్రవాసులతో కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం చర్చలను జరిపింది. వీరిలో ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలపై స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే తెలంగాణ ప్రవాసులు సీఎం రేవంత్ రెడ్డిని అమెరికాకు ఆహ్వానించారు. ప్రభుత్వం కూడా పెట్టుబడును రాబట్టే ఉద్దేశం లో ఉండడంతో రేవంత్ రెడ్డి అమెరికాకు బయలుదేరి వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. అలాగే దక్షిణ కొరియాలోని కీలక వాణిజ్య సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధులతోనూ కీలకమైన చర్చలను జరపడం ద్వారా భారీ ఎత్తున పెట్టుబడును ఆకర్షించే అవకాశం ఉందని భావించిన రేవంత్ రెడ్డి అమెరికా నుంచి నేరుగా దక్షిణ కొరియాకు అనుగుణంగా షెడ్యూల్ను ఖరారు చేసుకున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్